Sunday, July 13, 2025

డొమెస్టిక్ ఫ్లైట్‌ అని ఎక్కితే.. ఏకంగా ఇంకో దేశంలో దించేశారు..

- Advertisement -
- Advertisement -

కరాచీ: పాకిస్థాన్‌కు చెందిన ఓ ఎయిర్‌లైన్స్ (Pakistan Airlines) చేసిన ఘనకార్యం వల్ల స్వదేశంలో దిగాల్సిన ఓ వ్యక్తి ఏకంగా వేరే దేశంలో దిగాల్సిన పరిస్థతి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్‌కు చెందిన షాజహాన్ అనే వ్యక్తి లాహోర్ నుంచి కరాచీకి వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. సెక్యూరిటీ చెకింగ్ పూర్తి చేసుకొని కరాచీ వెళ్లే విమానం అనుకొని మరో విమానం ఎక్కేడు. సిబ్బందికి తన టికెట్ చూపించినప్పుడు కూడా వాళ్లు తప్పును గమించలేదు.

విమానం టేకాఫ్ అయిన ఎంతసేపటికీ కరాచీ రాకపోగంతో షాజహాన్ అనుమానం వచ్చి విమాన సిబ్బందిని ప్రశ్నించగా.. అసలు విషయం అప్పుడు బయటపడింది. కరాచీ వెళ్లే విమానం కాకుండా.. అతను సౌదీ వెళ్లే విమానంలో ఎక్కాడు. అయితే సిబ్బంది మాత్రం ప్రయాణికుడిదే తప్పు అని దబాయించారు. కనీసం తిరిగి కరాచీ చేర్చమంటే.. దానికి మూడు రోజుల సమయం పడుతుందని చెప్పారు. ఈ గందరగోళానికి కారణమైన సదరు ఎయిర్‌లైన్స్ మాత్రం ప్రయాణికుడు ఇంకో టికెట్ కొంటే కానీ.. అతన్ని కరాచీకి పంపించమని చెప్పింది.

ఇక ప్రయాణికుడి వద్ద పాస్‌పోర్ట్‌ లేకపోవడంతో జెడ్డా ఎయిర్‌పోర్టులో అతన్ని అధికారులు అదుపులోకి తీసుకొని కాసేపు విచారించారు. పరిస్థితిని అర్థం చేసుకొని అతన్ని లాహోర్‌కు తిరిగి పంపించారు. ఈ విషయంపై పాకిస్థాన్ ఎయిర్‌పోర్టు అథారిటీ నుంచి పౌర విమానయాన శాఖకు లేఖ పంపించింది. దీంతో సదరు ఎయిర్‌లైన్స్‌కు (Pakistan Airlines) భారీ జరిమానా విధించారు. లాహోర్ విమానాశ్రయంల మరమ్మత్తులు జరుగుతున్న క్రమంలో డొమెస్టిక్ టెర్మినల్‌నే అంతర్జాతీయ విమానాలను ఉంచడం వల్ల ఈ తప్పిదం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News