మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘వార్ 2’.(War 2) వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందుతోన్న ఈ ఆరవ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. వార్ 2 సినిమా గురించి చిత్ర దర్శకుడు అయాన్ మాట్లాడుతూ “ఇండియన్ సినిమాలో ఐకానిక్ స్టార్స్ అయిన హృతిక్, ఎన్టీఆర్ మధ్య సంఘర్షణ అనేది అందరినీ ఆకర్షించేలా కథను రూపొందించటంలో నేను ఎక్కువగా సమయాన్ని వెచ్చించాను. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ఇష్టపడిన వార్ సినిమాకు కొనసాగింపుగా ఫ్రాంచైజీని రూపొందించటం, దానిపై నాదైన ముద్ర వేయాలనుకుని కష్టపడటాన్ని ఓ పెద్ద బాధ్యతగా భావించాను.
ఎన్టీఆర్, హృతిక్(NTR, Hrithik) మధ్య ఉండే సంఘర్షణ అనేది అందరికీ కనెక్ట్ అయ్యేలా కథను, అందుకు తగినట్టు యాక్షన్ సన్నివేశాలను రూపొందించాం. ఇండియన్ సినిమాలోని ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్ ఒకచోటికి చేరేలా వార్2 సినిమా చేసింది. వీరిద్దరి కలయికలో సిని మా ఎలా ఉంటుందోనని అభిమానులు, ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఉంటారో, వారి అంచనాలేం టో తెలుసు. అలాంటి వారు థియేటర్స్‌కు వచ్చినప్పుడు వారికి జీవితకాలం గుర్తుండేలా ఈ సినిమాను రూపొందించాం”అని అన్నారు. ఇక ‘వార్ 2’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్ కానుంది.