Friday, May 23, 2025

పేట్ బషీరాబాద్ లో దారుణం

- Advertisement -
- Advertisement -

పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి సెంట్రల్ పార్క్ వీధి మార్కెట్లో లో ఓ వ్యక్తి పై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో కుప్పకూలిపోయాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు.  కూరగాయల మార్కెట్ లో మేడ్చల్ కు చెందిన సిద్దిక్ పై ప్రత్యర్థి దాడి చేశాడు. బ్యాటరీ లైట్లు సప్లై చేసే సిద్ధిక్ పై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు.పాత కక్షలు కారణంగా దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News