Friday, May 16, 2025

ఆ వార్తల్లో నిజం లేదు.. తేల్చేసిన సమంత మేనేజర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ‘ఏం మాయ చేశావే’ సినిమాతో అందరిని మాయ చేసి. స్సల్పకాంలోనే టాప్ హీరోయిన్‌గా మారిపోయారు సమంత(Samantha). ఒకప్పుడు ఫుల్ బిజీగా ఉన్న సామ్.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా సమంత కొత్త అవతారం ఎత్తారు. ‘ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్’ బ్యానర్‌ను ప్రారంభించారు. ఈ బ్యానర్‌లో వచ్చిన తొలి సినిమా ‘శుభం’ గ్రాండ్ సక్సెస్‌ని అందుకుంది. ఈ నేపథ్యంలో ఆమెపై మరోసారి రూమర్స్(Rumors) వచ్చాయి.

ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న సామ్(Samantha).. కొన్ని ఫోటోలను సోషల్‌మీడియా ద్వారా పంచుకుంది. ఈ ఫోటోల్లో ఆమె దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి దిగిన ఫోటో కూడా ఉంది. దీంతో వీరిద్దరుపై మరోసారి రూమర్స్ మొదలయ్యాయి. వీరిద్దరు త్వరలో వివాహం చేసుకుంటారని నెటిజన్లు అనుకున్నారు. వీటిపై సమంత మేనేజర్ స్పందించారు. ఆ వార్తలను ఆయన ఖండించారు. అవి కేవలం రూమర్స్(Rumors) మాత్రమే అని.. నమ్మవద్దని స్ఫష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News