Wednesday, August 13, 2025

ఇడి కార్యాలయానికి మంచు లక్ష్మీ.. కొనసాగుతున్న విచారణ

- Advertisement -
- Advertisement -

ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు విచారణలో భాగంగా నటి మంచు లక్ష్మి ఇడి విచారణకు హాజరయ్యారు. బుధవారం ఆమె హైదరాబాద్ లోని ఇడి కార్యాలయానికి వెళ్లారు. ప్రస్తుతం మంచు లక్ష్మీని ఇడి అధికారులు విచారిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ తో లావాదేవీలతోపాటు పలు విషయాలపై ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈజీగా డబ్బు సంపాదించొచ్చు అంటూ సోషల్‌ మీడియాలో పలు ఆన్ లైన్ గేమింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేసిన పలువురు సినీ, క్రీడా ప్రముఖులను ఇడి నోటీసులు ఇచ్చి విచారిస్తోంది. ఈ కేసులో నటులు, యాంకర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్యూయెన్సర్లు, టీవీ హోస్ట్‌లతో సహా 29 మందిపై అక్రమ బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించినందుకు ఇడి కేసు నమోదు చేసింది. ఈ కేసు జంగ్లీ రమ్మీ, ఎ23, జీట్‌విన్, పారిమ్యాచ్, టోటస్365 వంటి ప్లాట్ ఫామ్‌లకు చెల్లించిన ప్రమోషన్లపై నమోదైంది. 1867 పబ్లిక్ జూదం చట్టం కింద పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్, సూర్యాపేటలతో పాటు ఆంద్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలలో ఐదు వేరువేరు ఎఫ్‌ఐఆర్‌ను నమోయ్యాయి. ఈ కేసులో మనీలాండరింగ్ జరిగిందనే కోణంలో ఇడి అధికారులు దృష్టి సారించారు.

ఈ కేసులో ఇడి.. ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్షర్మేషన్ రిపోర్ట్ (ఇసిఐఆర్) నమోదు చేసింది. ఇందులో బాగంగా కేసులో ఉన్న నిందితులను వరుసగా ఇడి విచారిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో నటులు ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, రానాలను విచారించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News