Saturday, June 28, 2025

‘కన్నప్ప’ ఒటిటి రిలీజ్.. ఎప్పుడో చెప్పేసిన మంచు విష్ణు

- Advertisement -
- Advertisement -

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ‘కన్నప్ప’ చిత్రం గురించే టాక్ నడుస్తోంది. మంచు విష్ణు ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా శుక్రవారం విడుదలై మంచి సక్సెస్‌ను సాధించింది. విష్ణుతో పాటు ఈ సినిమాలో పలువురు సెలబ్రిటీలు నటించడం చిత్రానికి ప్లస్ పాయింట్ అయింది. అయితే సాధారణంగా ఓ సినిమాకు మంచి టాక్ వస్తే.. ఆ చిత్రాని థియేటర్‌కి వెళ్లి చూడటమో.. లేదా అది ఒటిటిలో(Kannappa OTT Release) విడుదలయ్యే వరకూ ఎదురుచూడటమో చేయాలి. ఇప్పుడు కన్నప్ప విషయంలో కూడా చాలా మంది అదే అనుకుంటున్నారు. థియేటర్‌కి వెళ్లి చూసే టైమ్‌ లేని వాళ్లు సినిమా ఎప్పుడు ఒటిటిలో వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

అయితే కన్నప్ప ఒటిటి రిలీజ్‌పై (Kannappa OTT Release) విష్ణు తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్‌కి ఒకరోజు ముందు విష్ణు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సినిమాను ఎప్పుడు ఒటిటిలో రిలీజ్ చేస్తారా..? అనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. సినిమా విడుదలైన 10 వారాల తర్వాత చిత్రాన్ని ఒటిటిలో విడుదల చేస్తామని విష్ణు స్పష్టం చేశారు. దీంతో ఈ సినిమాను ఒటిటిలో చూడాలంటూ.. దాదాపు రెండున్నర నెలలు వేచి చూడాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News