హైదరాబాద్: మంచు విష్ణు(Manchu Vishnu) ప్రధాన పాత్రలో ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన మైథలాజికల్ మూవీ ‘కన్నప్ప’ (Kannappa). భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌బాబు, మోహన్‌లాల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూన్ 27, 2025న ఈ సినిమాను విడుదల చేసేందుకు అంతా సిద్ధం చేశారు. అయితే ఈ లోపే కన్నప్ప సినిమాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
‘కన్నప్ప’ (Kannappa) సినిమాకు సంబంధించిన హార్డ్‌డిస్క్ మిస్ అయింది. ఇందులో సినిమాకు సంబంధించిన 1.30 గంటల ఫూటేజ్ ఉన్నట్లు సమాచారం. దీనిపై చిత్ర బృందం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దీనిపై సమగ్రంగా విచారణ చేస్తున్నారు. ఒకవేళ హార్డ్‌డిస్క్‌లో ఉన్న కంటెంట్ ఆన్‌లైన్‌లో లీక్ అయితే తీవ్ర నష్టాన్ని మిగిలిస్తుంది. అయితే తాజాగా ఈ విషయంపై మంచు విష్ణు (Manchu Vishnu) స్పందించారు. సోషల్‌మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశారు. ‘జటాజూటధారీ, నీ కోసం తపస్సు చేసే నాకెందుకు ఈ పరీక్ష స్వామీ? #హరహరమహాదేవ్’ అంటూ విష్ణు ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.