Wednesday, June 4, 2025

మంగళవారం రాశిఫలాలు (03-06-2025)

- Advertisement -
- Advertisement -

మేషం: రహస్య చర్చలు రహస్య ప్రయాణాలు తప్పకపోవచ్చు,  సాహిత్య కళా రంగాల పట్ల అభిరుచిని కనబరుస్తారు.  ఏమాత్రం ఉపయుక్తం లేని అంశాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి.

వృషభం: మీ మీద వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మీ యొక్క  గుడ్ విల్ రుజువు చేసుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు.

మిథునం:  విందు వినోదాల ద్వారా పరిచయాలను విస్తృత పరుచుకోవడానికి గాను అనువైన  మార్గాలు లభిస్తాయి.  రుణాలు చేయనంత వరకు ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడవు. రాబడి పెరుగుతుంది.

కర్కాటకం: భూమి సంబంధమైన వ్యవహారాలు కట్టడాలకు సంబంధించిన విషయాలు సానుకూల పడతాయి.  వృత్తి ఉద్యోగాలపరంగా అభివృద్ధి కోసం తీవ్రంగా శ్రమిస్తారు.

సింహం: చిన్నపాటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది.  ప్రభుత్వ రంగ పరంగా రావలసిన పెండింగ్ బిల్స్ కొలిక్కి వస్తాయి. ఖర్చులు అధికమవుతాయి. నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి.

కన్య:  నిరుద్యోగులకు ఉద్యోగం లభించే సూచన గోచరిస్తుంది. మీ శక్తికి మించి కష్టపడతారు. ఫలితాలను కూడా అదే విధంగా సాధిస్తారు. మానసిక ఆనందం కలిగి వుంటారు.

తుల: స్వయంకృతాపరాదాలు పదేపదే చోటు చేసుకోవడం వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆర్థిక అభివృద్ధి ఆశించిన స్థాయిలో ఉండకపోవడం కొంత ఇబ్బంది కలిగిస్తుంది.

వృశ్చికం: ఆర్థిక వ్యవహారాలు మినహా మిగతా విషయాలు  అనుకూలంగానే ఉంటాయి. ఉన్నతాధికారులతో జరిపే చర్చల వలన లాభపడతారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

ధనుస్సు:  చాలా కాలంగా పెండింగ్లో ఉన్న విషయాలను కొలిక్కి తీసుకురాగలుగుతారు. ప్రభుత్వ పరమైన లీజులు,  లైసెన్సులు సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలలో సాంకేతిక లోపాలు చోటు చేసుకుంటాయి.

మకరం: రాజకీయపరమైనటువంటి వ్యవహారాలు సానుకూల పడతాయి. వ్యాపార పరంగా స్వల్ప అభివృద్ధిని సాధించగలుగుతారు. న్యాయబద్ధమైన మీ వాదనలకు పలువురి మద్దతు లభిస్తుంది.

కుంభం: ఆత్మీయులతో వివాదాలు వచ్చే అవకాశం ఉంది తగిన జాగ్రత్త వహించాలి. ప్రజా సంబంధాలను మరింతగా పెంపొందించుకోగలుగుతారు. లిటిగేషన్ వ్యవహారాలు సానుకూలపడతాయి.

మీనం: టీం వర్క్ ను టీమ్  స్ప్రిరిట్ తో పూర్తి చేస్తారు. మీ ఆశయాలను నెరవేర్చుకోవడానికి గాను అరుదైన అవకాశాలు కలిసి వస్తాయి.  వృత్తి- వ్యాపారాలలో సానుకూల ఫలితాలను సాధించగలుగుతారు.

mangalavaaram rasi phalalu

Guruvaram rasi phalalu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News