- Advertisement -
బెంగళూరు: తండ్రి కాల్చి పడేసిన బీడీ ముక్కను కుమారుడు నోట్లో పెట్టుకోవడంతో గొంతులో ఇరుక్కోవడంతో అతడు చనిపోయాడు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం మంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అడ్వార్‌లో లక్ష్మీదేవి తన కుటుంబ సభ్యులతో కలిసి ఉటుంది. లక్ష్మీదేవి పది నెలల తనయుడు అనీశ్ కుమార్ ఉన్నాడు. లక్ష్మీదేవి భర్త బీడి కాల్చి ముక్కను కిందపడేశాడు. పసి బాలుడు ముక్కను నోట్లో పెట్టుకోవడంతో గొంతులో ఇరుక్కుపోయింది. బాలుడు అపస్మారక స్థితిలోకి పోవడంతో వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. బీడీ ముక్క గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక బాలుడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మీదేవి స్వస్థలం బిహార్.
- Advertisement -