- Advertisement -
న్యూయార్క్: అమెరికాలో కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. న్యూయార్క్ లోని మన్ హట్టన్ లో మంగళవారం ఉదయం దుండగుడు కాల్పులు జరపడంతో ఆరుగురు మృతి చెందారు. దుండగుడి కాల్పుల్లో పోలీసు అధికారితో సహా ఆరుగురు చనిపోయారు. 345 ఎవిలోని 52 వీధిలో కాల్పుల శబ్ధం విని భవనం నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గుర్తు తెలియని దుండగుడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కాల్పుల్లో ముగ్గురు గాయపడినట్టు సమాచారం. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో ఎన్ వైపిడి అధికారి ఉన్నాడు.
- Advertisement -