Wednesday, September 3, 2025

ధర్పల్లిలో ఉన్మాది వీరంగం

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండల కేంద్రంలో మంగళవారం ఓ ఉన్మాది వీరంగం సృష్టించాడు. కత్తెరతో ఆరుగురిపై విరుచుకుపడ్డాడు. వీరిలో తీవ్రంగా గాయపడిన ఒకరు మృతి చెందారు. వివరాలలోకి  వెళ్తే… ధర్పల్లిలోని ఎన్‌టిఆర్ కాలనీకి చెందిన వడ్ల దాసు ఉన్మాదిలా వ్యవహరించాడు. మొదట కాలనీలో గల మచ్చ లక్ష్మిని కత్తెరతో పొడిచాడు. తల్లి అరుపులు విన్న ఆమె కూతురు గౌతమి అడ్డు వెళ్లింది. దీంతో ఆమెను కూడా పొడిచాడు. అక్కడ ఏదో గొడవ జరుగుతోందని గమనించి పక్కింటివారు వెళ్ళగా వారిలో శెట్పల్లి నాగరాజు, అతని భార్య శోభను కూడా పొడిచాడు. అక్కడి నుండి కాలనీలో కిరాణా షాపు నిర్వహిస్తున్న శెట్పల్లి భోజేశ్వర్ దగ్గరికు వెళ్లి అతనిపై కూడా దాడి చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఉన్మాది దాడిలో గాయపడిన నలుగురిని నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. క్షతగాత్రులు ఎవరికీ ప్రాణాపాయం లేదని తెలిపారు. ఈ సంఘటనకు దారితీసిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు. ప్రస్తుతం విచారణ జరుగుతోందని, పూర్తి వివరాలు తరువాత వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News