Wednesday, September 17, 2025

రేపు పార్లమెంటు గాంధీ విగ్రహం వద్ద విపక్ష ఎంపిల ధర్నా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మణిపూర్ ఘటనపై చర్చ జరపడంపై పార్లమెంటులో ప్రతిష్టంభన కొనసాగుతున్న తరుణంలో దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ ఉభయ సభల్లో ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపిలు సోమవారం పార్లమెంటు ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా ‘ఇండియా’ కూటమిగా ఏర్పడిన వివిధ ప్రతిపక్ష పార్టీల నేతలు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే చాంబర్‌లో సమావేశమై ఈ అంశంపై పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చిస్తారని సంబంధిత వర్గాలు తెలిపారు. సోమవారం ఉదయం పది గంటలకు జరిగే ఈ సమావేశం అనంతరం ఉభయ సభల్లోకి వెళ్లడానికి ముందు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు గాంధీజీ విగ్రహం వద్ద ధర్నా చేస్తారని ఆ వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News