Monday, September 15, 2025

మణిపూర్ హింసాకాండ వెనుక చైనా హస్తం : సంజయ్ రౌత్

- Advertisement -
- Advertisement -

ముంబై : మణిపూర్ హింసాకాండ వెనుక చైనా హస్తం ఉందని, అక్కడ అలజడి రేపడంలో చైనా కుట్రపూరితంగా వ్యవహరించిందని, శివసేన (యూబీటీ) నేత, ఎంపి సంజయ్ రౌత్ ఆరోపించారు. చెనాపై ఎలాంటి చర్యలు చేపట్టారో కేంద్ర ప్రభుత్వం దీనికి జవాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రంలో మణిపూర్‌లో బీజేపీ అధికారంలో ఉండగా ఈశాన్య రాష్ట్రం మే 3 నుంచి అశాంతితో భగ్గుమంటోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read: మంత్రులు కావాలనే నిర్ణయం వ్యక్తిగతం, పార్టీ మద్దతు లేదు: ఎన్సీపీ

40 రోజులుగా మణిపూర్‌లో అల్లర్లు చెలరేగుతూ రాష్ట్రం అట్టుడుకుతోందని, ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టి పునరావాస శిబిరాల్లో తలదాడుకుంటున్నారని ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు మీరేం చర్యలు తీసుకున్నారో చెప్పాలని కాషాయ నేతలను ఆయన నిలదీశారు. మణిపూర్‌లో శాంతి భద్రతలను కాపాడటంలో విఫలమైన ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 50 రోజులుగా జరుగుతున్న ఘర్షణల్లో విదేశీ హస్తం ఉందని బీరేన్‌సింగ్ సంకేతాలు పంపిన నేపథ్యంలో శివసేన నేత ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల బీరేన్ రాజీనామా వరకు వెళ్లి చివరి నిమిషంలో ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News