ఆసియా కప్-2025కి ఎంపిక చేసిన భారత జట్టు విషయంలో విమర్శలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా జట్టులోకి శ్రేయస్ అయ్యర్ ఎంపిక చేయకపోవడం.. యశస్వీ జైస్వాల్‌ని స్టాండ్‌బై ప్లేయర్‌గా తీసుకోవడంపై అభిమానులు, మాజీలు సెలక్టర్లు, కోచ్ గౌతమ్ గంభీర్‌పై (Gautam Gambhir) మండిపడుతున్నారు. తాజాగా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ కూడా ఈ జట్టు ఎంపికపై అసహనం వ్యక్తం చేశారు. టీం ఇండియాలో అర్హులైన ఆటగాళ్లకు చోటు దక్కడం లేదని పేర్కొన్నారు. సెలక్టర్ల సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని డిమాండ్ చేశారు. అసలు ఓ ఆటగాడిని ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తున్నారు?.. వేరొకరిని ఎందుకు పక్కనపెడుతున్నారు? అనే విషయంలో క్లారిటీ ఇవ్వాలని అన్నారు.
‘‘ఆసియా కప్‌లో ఆడే జట్టులో స్థానానికి శ్రేయస్ అయ్యర్, యశస్వీ జైస్వాల్ ఇద్దరు అర్హులే. కానీ, వీరిద్దరికి జట్టులో చోటు దక్కలేదు. గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) పాత ఇంటర్వ్యూల్లో చాలాసార్లు టి-20 జట్టు నుంచి జైస్వాల్‌ని పక్కన పెట్టకూడదని అన్నారు. కానీ ఇప్పుడు ఆయనే ప్రధాన కోచ్ అయినా.. జైస్వాల్‌కి ఎందుకు చోటు దక్కలేదు’’ అని మనోజ్ తివారీ ప్రశ్నించారు. కాగా, సెప్టెంబర్ 9 నుంచి 28 వరకూ ఆసియా కప్ జరగనుంది. ఎనిమిది జట్లు టి-20 ఫార్మాట్‌లో ఈ టోర్నమెంట్‌లో యుఎఇ వేదికగా తలపడనున్నాయి.
Also Read : కారులో ధోనీ చక్కర్లు.. ఆ వాహనం ప్రత్యేకత ఏంటంటే..