బీజాపూర్: ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 27మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత, పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశరావు (Maoist Nambala) కూడా మృతి చెందినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్‌లో వెల్లడించారు. నక్సలిజం నిర్మూలనలో ఇదొక మైలురాయి విజయంగా అమిత్ షా పేర్కొన్నారు.
మూడు దశాబ్దాలుగా నక్సలిజానికి వ్యతిరేకంగా కొనసాగిస్తున్న పోరులో ప్రధాన కార్యదర్శి స్థాయి నేత (Maoist Nambala) మృతి చెందడం ఇదే తొలిసారి అని ఆయన అన్నారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్టు పూర్తయిన తర్వాత ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మహారాష్ట్రల్లో 54 మంది నక్సలైట్లు అరెస్టు అయ్యారని, 84 మంది లొంగిపోయారని షా తెలిపారు. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలించేందుక మోడీ సర్కార్ దృఢ సంకల్పంతో ఉందని షా పేర్కొన్నారు. కాగా, నంబాలపై రూ.కోటిన్నర రివార్డు ఉందని పోలీసులు తెలిపారు.