Saturday, July 26, 2025

మావోయిస్టు పార్టీ మెంబర్ నార్ల శ్రీవిద్యకు రిమాండ్

- Advertisement -
- Advertisement -

మావోయిస్టు పార్టీ మెంబర్ నార్ల శ్రీవిద్యను శుక్రవారం ఉదయం రంగారెడ్డి జిల్లా కోర్టులో పోలీసులు ప్రవేశ పెట్టారు. పోలీసుల వాదనలు విన్న న్యాయమూర్తి శ్రీవిద్యకు రిమాండ్ విధించారు. వివరాల్లోకి వెళితే.. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు తక్కల పల్లి వాసుదేవ రావు అలియాస్ ఆశన్న సతీమణి నార్ల శ్రీవిద్య ను తెలంగాణ పోలీసులు హఫీజ్‌పేట్‌లో గురువారం అదుపులోకి తీసుకున్నారు. శుక్రవా రం కోర్టులో ప్రవేశపెట్టడంతో న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీంతో ఆమెను సంగారెడ్డి జిల్లాలోని కంది జైలుకు పోలీసులు తరలించారు. మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో పోలీసులు శ్రీవిద్యను అరెస్ట్ చేసినట్లుగా ప్రాథమికం సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కాగా, శ్రీవిద్య ఐపిఎస్ అధికారి ఉమేష్ చంద్ర హత్య కేసు, మాజీ సిఎం చంద్రబాబు పై జరిగిన అటాక్‌తో పరోక్షంగా సంబంధాలు కలిగి ఉన్నట్లు ఆరో పణలున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News