Monday, May 12, 2025

చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం

- Advertisement -
- Advertisement -

చత్తీస్‌గఢ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లా, ఉసురు పోలీస్‌స్టేషన్ పరిధి, లింగాపూర్‌లో నాగ బండారి అనే వ్యక్తిని ఆదివారం రాత్రి 11:30 నిమిషాలకు మావోయిస్టులు గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపారు. వివరాల్లోకి వెళ్తే.. నాగ బండారి లింగాపూర్ గ్రామానికి ఒక సామాజిక కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లాడు. అక్కడికి వచ్చిన మావోయిస్టులు అతనిని బంధించి, గొడ్డలితో నరికి చంపారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నాగ బండారి మారుదబాక సొసైటీ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. ఆరు నెలల క్రితం నాగ బండారి తమ్ముడు తిరుపతి బండారిని కూడా మావోయిస్టులు అతి కిరాతకంగా హత్య చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News