- Advertisement -
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్- 2025ను కేంద్రం ప్రకటించింది. అవార్డులకు వివిధ రాష్ట్రాలకు చెందిన 45 మంది ఉపాధ్యాయులను కేంద్రం సోమవారం ఎంపిక చేసింది. వీరిలో తెలంగాణ రాష్ట్రం నుంచి సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సైన్స్ ఉపాధ్యాయురాలు మారం పవిత్ర జాతీయ ఉత్తమ ఉపాధ్యాయినిగా ఎంపికయ్యారు. ఎపిలోని విశాఖ నెహ్రూ మున్సిపల్ హైస్కూల్‌కు చెందిన తిరుమల శ్రీదేవి ఈ జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 5వ తేదీన ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగే కార్యక్రమంలో అవార్డులు ప్రదానం చేయనున్నారు. అవార్డు గ్రహీతలను రూ.50 వేల నగదు, సిల్వర్ మెడల్‌తో సత్కరిస్తారు.
- Advertisement -