- Advertisement -
మన తెలంగాణ/రఘునాథపల్లి: పురుగుల మందు తాగి వివాహిత మృతిచెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై దూదిమట్ల నరేశ్ కథనం ప్రకారం.. రఘునాథపల్లి మండలం శివాజీనగర్‌కు చెందిన పొన్నాల రమ(39) భర్త తాగుడుకు అలవాటు పడి అప్పులు చేస్తున్నాడని వద్దనా పల్సర్ బండి కొన్నాడని గొడవలు పడ్డారు. అయినా తన భర్త మారడం లేదని జీవితంపై విరక్తి చెంది ఈనెల 11న గడ్డికి కొట్టే మందు తాగగా చికిత్స నిమిత్తం జనగామకు తీసుకెళ్లిన అనంతరం ఎంజీఎం హాస్పిటల్‌లో ఏర్పించిన తరువాత మెరుగైన చికిత్స కోసం అజార ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తుండగా శనివారం మృతిచెందినట్లు తన చెల్లెలు కుటుంబ సభ్యుల గొడవల వల్ల ఆత్మహత్య చేసుకుందని మృతురాలి అన్న బోయిని రవి పల్లగుట్ట దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దూదిమట్ల నరేశ్ తెలిపారు.
- Advertisement -