- Advertisement -
మన తెలంగాణ/పాలకవీడు: మండలంలోని రావి పహాడ్ గ్రామంలో ఉరి వేసుకుని వివాహిత మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కళాశ్రీ(20) భార్యాభర్తల మధ్య నెలకొన్న గొడవల కారణంగా ఇంట్లో ఉరి వేసుకున్నట్లు సమాచారం.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.. డిఎస్పి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది.. తమ కూతురిని భర్త పవన్ అత్త బట్ట ఉమ మామ హనుమంతు ఆడపడుచు ప్రియా అందరూ కలిసి కొట్టి చంపారని అమ్మాయి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూర్నగర్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు.
- Advertisement -