Saturday, August 23, 2025

‘మార్వాడీ గో బ్యాక్’ బంద్ ప్రశాంతం

- Advertisement -
- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం ఊపిరిపోసుకుంటోంది. మార్వాడీ వ్యాపారులతో స్థానికుల ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయన్న కారణంతో పలుచోట్ల వ్యాపారులు బంద్‌కు పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ మోండా మార్కెట్‌లో ఓ దళితుడిపై మార్వాడీల దాడిని ఖండిస్తూ శుక్రవారం తెలంగాణ బంద్‌కు ఓయూ జెఎసి చైర్మన్ కొత్తపల్లి తిరుపతి పిలుపు నిచ్చారు. ఓయూ జెఎసి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో బంద్ కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పలుచోట్ల పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బంద్ నేపథ్యంలో భారీగా మోహరించిన పోలీసులు కొందరు స్థానిక వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు. ఓయూ జెఎసి చైర్మన్ కొత్తపల్లి తిరుపతిని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. “గో బ్యాక్ మార్వాడి గో బ్యాక్ గుజరాతి రాజస్థాన్‌” ఉద్యమానికి శ్రీకారం చుట్టిన కొత్తపల్లి తిరుపతిని ఓయూ హాస్టల్ నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం నల్లకుంట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇదిలావుంటే, సికింద్రాబాద్ మోండా మార్కెట్‌లో తనపై జరిగిన దాడికి మార్వాడీలకు ఎలాంటి సంబంధం లేదని దాడిలో గాయపడిన బాధితుడు సాయి వివరణ ఇచ్చారు. కేవలం తనకు, ఎస్‌కె జువెల్లర్స్‌కు మధ్య మాత్రమే వివాదం జరిగిందని తెలిపాడు. మరో వైపు ఆల్ మర్చంట్ అసోసియేషన్ ప్రత్యేకంగా సమావేశమైంది. ‘మార్వాడి కో హఠావో తెలంగాణ బచావో’ అనే నినాదంతో కార్యాచరణ రూపొం దించుకుంటున్నారు. శుక్రవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. మార్వాడీల మేజిక్‌తో తమ వ్యాపారాలు దెబ్బయిపోతున్నాయని స్థానిక వ్యాపారులు వాపోతున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో మార్వాడీ వ్యాపారస్తులకు నిరసనగా దుకాణ సముదాయాలు బంద్ చేసి వ్యాపారస్తులు నిరసన తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మోత్కూర్, ఆత్మకూర్(ఎం) మండల కేంద్రాల్లో స్వచ్చంద బంద్‌లో వర్తక, వ్యాపారులు పాల్గొన్నారు. బంద్‌కు మద్దతుగా స్వచ్చందంగా దుకాణాలు మూసివేసి నిరసన తెలిపారు. మార్వాడీ గో బ్యాక్ అంటూ చౌటుప్ప ల్‌లో వాణిజ్య సముదాయాలు బంద్ చేసి వ్యాపారస్తులు మద్దతు తెలిపారు.

కరీంనగర్ జిల్లాలో మార్వాడీ గో బ్యాక్ బంద్ పిలుపు నేపథ్యంలో జమ్మికుంటలో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. జమ్మికుంట పట్టణంలో వ్యాపారులు బంద్ పాటించారు. బంద్ సందర్భంగా పలు వురు స్థానిక వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పట్టణంలో పలు చోట్ల పోలీసు బందో బస్తు ఏర్పాటు చేశారు. సిద్ధిపేట జిల్లాలో మార్వాడీ గో బ్యాక్ నినాదంతో దుబ్బాక జెఎసి నాయకుల పిలుపు మేరకు దుబ్బాకలో బంద్ కొన సాగింది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్‌లో మార్వాడీ వ్యాపారస్తులకు వ్యతిరేకంగా ఓయూ జెఎసి పిలుపునకు మద్దతుగా కిరాణా, వర్తక, వస్త్ర, స్వర్ణకార్ల షాప్‌లు బందు పాటించాయి. ఓయూ జెఎసి పిలుపుతో షాపులు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. మార్వాడీ గో బ్యాక్ అంటూ వ్యాపా రులు నినాదాలు చేస్తున్నారు. ఎక్కడో నుంచి వచ్చి తమ ఉపాధి దెబ్బతీస్తున్నారని వ్యాపా రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మార్వాడీ గో బ్యాక్’ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ క్యాంపెయిన్‌ని నిర్వహిస్తున్న పృథ్విరాజ్ యాదవ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి విదితమే. కాగా మార్వాడీలకు బిజెపి నేతలు బండి సంజయ్, రాంచందర్‌రావు, రాజాసింగ్ మద్దతుగా నిలిచారు.

పెద్దపల్లి జిల్లా ధర్మారం పట్టణ వ్యాపార సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం చేపట్టిన బంద్ విజయవంతమైంది. అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛం దంగా మూసివేశారు. ఈ సందర్భంగా వ్యాపారులందరూ స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుంచి పురవీధుల గుండా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో సమావేశమై గో బ్యాక్ మార్వాడీ.. అంటూ నినాదాలు చేశారు. కందుకూరు మండల కేంద్రంలో తెలంగాణ జెఎ సి పిలుపు మేరకు స్థానిక వ్యాపారస్తులందరూ స్వచ్చందంగా తమ వ్యాపార దుకాణాలను బంద్‌చేపట్టి శ్రీశైలం హైద్రాబాద్ జాతీయ రహదారిపై మార్వాడీ గోబ్యాక్ ప్లెక్స్‌తో నిరసనచేస్తూ ర్యాలీ చేపట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News