సూర్య మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘సూర్య45’ (Surya 45)కోసం దర్శకుడు ఆర్జే బాలాజీతో చేతులు కలిపారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. తమిళం, తెలుగు, హిందీ పరిశ్రమలలో పాపులర్ కంటెంట్‌ను అందించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని స్కేల్, కంటెంట్ రెండింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. సూర్య ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ’కరుప్పు’ ఫస్ట్ లుక్ టీజర్ సూర్య బర్త్‌డే సందర్భంగా రిలీజ్ అవ్వడంతో ఫ్యాన్స్‌కి ఇది డబుల్ ట్రీట్ అయింది. టీజర్ ఓ మాస్ పండుగలా ఉంటుంది. సూర్య పవర్‌ఫుల్ అవతార్‌లో అదిరిపోయే లుక్‌తో కనిపించారు.
1 నిమిషం 38 సెకన్ల టీజర్‌లో మాస్ మోమెంట్స్, ఫైర్ విజువల్స్, పవర్ ఫుల్ బీజీఎం అన్నీ అద్భుతంగా వున్నాయి. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా, ఆయనకు మాస్ జానర్‌లో (mass genre) చేసిన తొలి ప్రాజెక్ట్. సోషల్ కథలతో గుర్తింపు తెచ్చుకున్న బాలాజీ ఇప్పుడు సూర్యతో కలిసి ఒక బలమైన, కమర్షియల్ సినిమాని తీసుకొచ్చారని టీజర్ చూస్తే అర్ధమవుతోంది. ఈ సినిమాలో త్రిష, ఇంద్రన్స్, స్వసిక, అనఘ మాయ రవి, శివధా, నట్టి, సుప్రీత్ రెడ్డి ఇలా ఒక్కొక్కరు బలమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాని ఫెస్టివల్ రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు. ఈ టీజర్ చూశాక కరుప్పు సినిమా మాస్‌కి ఓ గిఫ్ట్‌లా రాబోతుందని అర్ధమవుతోంది.