Monday, July 21, 2025

‘ఉస్తాద్ భగత్ సింగ్’లో మరో బ్యూటీ?

- Advertisement -
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) హీరోగా శ్రీలీల హీరోయిన్‌గా దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్. అయితే ఈ సినిమాలో శ్రీలీల కాకుండా మరో బ్యూటీ కూడా ఉంటుంది అని వార్తలు వచ్చాయి. మరి ఆ హీరోయిన్ ఎవరో కాదట బబ్లీ బ్యూటీ రాశి ఖన్నా అని తెలుస్తోంది. రాశి, పవన్ కాంబినేషన్‌లో (Pawan combination) ఎప్పుటి నుంచో పవన్ అభిమానులు సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఫైనల్‌గా ఇప్పుడు సెట్ అయ్యేలా కనిపిస్తుంది. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉందో చూడాలి. ఇది వరకు పవన్ సినిమాల్లో ఇద్దరు హీరోయిన్స్ కనిపించారు. ఇక ఇందులో కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News