- Advertisement -
హైదరాబాద్: నగరంలో భారీ పేలుళ్లకు చేసిన కుట్రని తెలంగాణ కౌంటర్ ఇంటలిజెన్స్ అధికారులు భగ్నం చేశారు. ఇందుకు ప్లాన్ చేసిన ఇద్దరి వ్యక్తులను అరెస్ట్ చేశారు. విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రహ్మాన్(29), హైదరాబద్‌కు చెందిన సయ్యద్ సమీర్(28) విజయనగరంలో పేలుడు కొనుగోలు చేసి.. హైదరాబాద్‌లో (Hyderabad) పేలుళ్లకు స్కెచ్ వేశారు. సౌదీ అరేబియా నుంచి ఐసిసి మాడ్యూల్ ద్వారా వీరికి ఆదేశాలు వచ్చాయి. దీంతో పోలీసులు ఒక ఇంట్లో తనిఖీలు చేయగా.. పేలుళ్ల కోసం వినియోగించే అమ్మోనియా, సల్ఫర్, అల్యూమినియం పౌడర్లు లభించాయి. పేలుళ్లకు (Massive Blast) ప్రయత్నించిన వద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు త్వరలో వారిని కోర్టులో హాజరు పరుస్తామని పేర్కొన్నారు.
- Advertisement -