- Advertisement -
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఆదివారం సెలవుదినం కావడంతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో స్వామివారి ఉచిత దర్శనం కోసం వస్తున్న భక్తులతో వైకుంఠ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. శ్రీవారి దర్శనం కోసం కంపార్టుమెంట్ల వెలుపల క్యూలైన్ లో భక్తులు వేచి ఉన్నారు. దీంతో వెంకన్న సర్వ దర్శనానికి టోకెన్ పొందిన భక్తులకు 20 గంటల సమయం పడుతుంది. ఇక, శనివారం 91,720 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 44,678 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. స్వామి వారి హుండీ ఆదాయం రూ.3.80 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.
- Advertisement -