- Advertisement -
చత్తీస్‌గఢ్ రాష్ట్రం, నారాయణపూర్ జిల్లాలో శుక్రవారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోలు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఎదురుకాల్పుల్లో గాయపడిన పలువురు మావోలు తప్పించుకున్నట్లు పోలీసు బలగాలు చెబుతున్నాయి. తప్పించుకున్న వారి కోసం బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు.. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో పోలీసులు భారీగా మందుగుండు సామగ్రితో పాటు ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
- Advertisement -