- Advertisement -
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలో మంగళవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మెచుపట్టి ప్రాంతంలో రితురాజ్ హోటల్‌లో భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో 15 మంది సజీవదహనమయ్యారు. చాలా మంది భవనంలో చిక్కుకున్నట్టు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది.
- Advertisement -