Friday, August 15, 2025

పాకిస్థాన్‌లో కుండపోత వానలు… 154 మంది మృతి.. హైవేలు బంద్

- Advertisement -
- Advertisement -

పెషావర్ / ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో భారీ వర్షాలతో పరిస్థితి విషమించింది. అనేక ప్రాంతాలలో వర్షాలు వరదల సంబంధిత దుర్ఘటననలో కనీసం 154 మంది మృతి చెందారు. పలువురి జాడ తెలియకుండా పోయింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోనూ వరుసగా రెండు రోజులుగా కుండపోత వానలతో జనం తల్లడిల్లుతున్నారు. ఎక్కువగా కైబర్ పక్తూన్‌ఖ్వా ప్రాంతం ఎడతెరిపి లేని కుండపోత వానలతో దెబ్బతింది. కరాకోరం హైవే, బలిస్టాన్ హైవేలపై ట్రాఫిక్ స్తంభించింది. రతిగలి సరస్సు వద్ద చిక్కుపడ్డ 600 మంది యాత్రికులు ఎక్కడివారక్కడే ఉండాలని అధికారులు సమాచారం అందించారు. ఈ ప్రాంతానికి అనుసంధాన రోడ్లు తెగిపొయ్యాయి. కాలువలు పొంగిపొర్లుతున్నాయి. దీనితో టూరిస్టులు సురక్షిత ప్రాంతాలలోనే ఉండాలని, వాహనాలలో బయటకు రాకూడదని హెచ్చరికలు వెలువరించారు. పరిస్థితి సద్దు మణిగే వరకూ వీరు దిగ్బంధ పరిస్థితిలోనే ఉండాల్సి వస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News