- Advertisement -
హైదరాబాద్: చందానగర్‌లో కాల్పుల కలకలం రేగింది. ఖజానా జ్యువెలరీ షాప్‌లో భారీ దోపిడీ జరిగింది. షాప్ తెరిచిన 5 నిమిషాల్లోనే ఆరుగురు దొంగలు గన్‌తో కాల్పులు జరిపి దోపిడీ చేశారు. దుండగులు రెండు రౌండ్లపాటు కాల్పులు జరపడంతో పాటు సిసి కెమెరాలను ధ్వంసం చేశారు. డిప్యూటీ మేనేజర్ కాళ్లపై దొంగల ముఠా కాల్పులు జరిపి జహీరాబాద్ వైపు పారిపోయారు. ఖజానా జ్యువెల్లరీ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జిల్లాల సరిహద్దులను పోలీసులు అలర్ట్ చేశారు. సైబరాబాద్ సిపి 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దొంగల గాలింపు చర్యలు చేపట్టారు.
- Advertisement -