మెల్‌బోర్న్: అంతర్జాతీయ క్రికెట్‌లో రిటైర్మెంట్ల పరంపర కొనసాగుతోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ క్రికెట్(టి20, టెస్టులు)కు వీడ్కోలు పలికారు. ఆ తర్వాత శ్రీలంకకు చెందిన ఏంజెలో మాథ్యూస్ కూడా టెస్ట్ ఫార్మాట్ నుంచి వైదొలిగాడు. తాజాగా ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇదేబాటలో దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ సైతం క్రికెట్ వీడ్కోలు పలికాడు. 36 ఏళ్ల గ్లెన్ మ్యాక్స్‌వెల్ 2012లో ఆస్ట్రేలియా తరఫున వన్డేల్లో అరంగేట్రం చేశాడు. 2015, 2013 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడుడు.
అయితే ప్రస్తుతానికి మ్యాక్సీ టి20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. ప్రపంచ కప్‌లో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన గ్లెన్ 2023 ప్రపంచ కప్లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వన్డే చరిత్రలోనే గ్లెన్ అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. ముంబైలోని వాంఖడేస్టేడియంలో ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్ జట్టు 292 పరుగుల లక్ష్యా న్ని నిర్దేశించింది. లక్ష ఛేదనకు దిగిన ఆసీస్ జట్టులోని 7 మంది బ్యాటర్లు 91 పరుగులకే ఔటయ్యారు. ఇక్కడి నుంచి ఆసీస్ ఓటమి ఖాయం అనిపించింది కానీ, మ్యాక్సీ తుఫాన్ బ్యాటింగ్‌తో గెలిపించాడు.
మ్యాక్సీ.. 128 బంతుల్లో 201 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ వన్డేల్లో 13 ఏళ్ల పాటు కొనసాగాడు. 149 మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో 33.81 సగటు, 126.70 స్ట్రైక్ రేట్‌తో 3,390 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 23 అర్ధ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్లో 77 వికెట్లు పడగొట్టాడు. భారత్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాక్‌వెల్ చివరిగా వన్డే మ్యాచ్ ఆడాడు.