చికాగో కార్మికులు 1886లో చేసిన వీరోచిత పోరాటoలో ఆరుగురు కార్మికుల అమరత్వం దోపి డి వర్గం దాష్టికానికి మరో ఏడుగురు ఉరితాడుకు ప్రా ణత్యాగం చేసిన ఫలితంగా 8 గంటల పనిదినం లభించింది.మెరుగైన పరిస్థితులు, కార్మిక సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు సాధించబడి ప్రపంచ వ్యాప్తంగా శ్రామిక వర్గం మే1 న ప్రపంచ కార్మిక పోరాట దినోత్సవం జరుపుకొంటున్నది. కార్మికవర్గ భవిష్యత్తు కోసం జీవితాన్ని త్యాగం చేసిన కార్మిక వీరులు మరణించి నేటికి 139 సంవత్సరాలు అవుతుంది.ప్రపంచ వ్యాప్తంగా శ్రామికులు,కార్మికులు 139వ మేడే జరుపుకుంటున్నారు. చికాగో అమరుల త్యాగాలను స్మరించుకుంటున్నారు. చికాగో నగరంలో ఏ బానిసత్వానికి వ్యతిరేకంగా ఏ 18 గంటలపని దినానికి వ్యతిరేకంగా కార్మికులు పోరాటం చేశారో దేశంలో నేటికీ అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ప్రపంచంలో దేశాలు నెలకొన్న ప్రస్తుత పరిస్థితులలో చికాగో కార్మికుల పోరాటాన్ని త్యాగాన్ని పూర్తిగా తీసుకొని మరో పోరాటానికి కార్మికులు సిద్ధం కావలసిన అవసరం నెలకొంది దేశంలో కార్మిక వర్గానికి దుర్భర దారిద్ర పరిస్థితులు ఎదుర్కొంటున్నది ప్రత్యేకంగా బిజెపి ఆర్‌ఎస్‌ఎస్ నాయకత్వంలో నరేంద్ర మోడీ ప్రధానిగా అధికారం చేపట్టిన తర్వాత కార్మికుల పరిస్థితి పెనం నుండి పొయ్యిలో పడిన చందంగా మారింది 12 గంటల పని దినం కనీస వేతనాలు చెల్లించకుండా ఉండే అధికారం యాజమాన్యాల కివ్వడం,యూనియన్లు పెట్టుకునే హక్కును కాలరాచివేయడం,కార్మిక హక్కుల సాధనకోసం వేతనాల పెంపుదల వేధింపులకువ్యతిరేకంగా ఆందోళనలు,సమ్మేల లాంటివి చేసేందుకు అవకాశాలు లేకుండా చేయడం ఒక్క మాటలో కార్మిక వర్గాన్ని యాజమాన్యాలు కార్పొరేట్ సంస్థల కాళ్లదగ్గర కట్టు బానిసలుగా చేసేందుకు 2020లో నాలుగు లేబర్ కోడులను తీసుకురావడం జరిగింది.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న ఉమ్మడి జాబితాలో ఉన్న కార్మిక విషయాలను కేంద్ర ప్రభుత్వమే చేతుల్లోకి తీసుకొని నిరంకుశంగా నాలుగు లేబర్ కోడెలను ప్రతిపక్ష పార్టీలులేనిసందర్భంలోపార్లమెంటు లో పెట్టి ఆమోదించడం జరిగింది. భారతదేశ కార్మిక వర్గానికి నాలుగు లేబర్ కోడ్ లు ఉరితాడుగా మారాయి. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికే 12 గంటల పని దినాన్ని అమలు చేస్తూ పని స్థలాల్లో కనీస రక్షణ చర్యలు లేకుండా కార్మిక శాఖ అధికారులకు హక్కులు అధికారాలను నామమాత్రం చేసి యాజమాన్యాలు కార్పొరేట్ సంస్థలకు సంపూర్ణమైన స్వేచ్ఛ స్వతంత్రాలను కట్టబెడుతున్నారు బిజెపియేతర కొన్ని రాష్ట్రాలు నాలుగు లేబర్ కోడెలను అమలు చేసేది లేదని ప్రకటించి ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడులకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానించి అమలు చేయబోమని ప్రకటించాల్సిన అవసరం ఉంది.
అత్యంత ప్రమాదకరమైన కార్మికులకు మనుగడ లేకుండా చేసే నాలుగు లేబరు కోడులకు వ్యతిరేకంగా కార్మికుల ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ప్రజల సొమ్ముతో స్థాపించబడిన ప్రభుత్వ రంగ పరిశ్రమలను బిజెపి ఆర్‌ఎస్‌ఎస్ ప్రభుత్వాలు అంబానీ అధానే వేదాంతలాంటి కార్పొరేట్ సంస్థలకు కారు చౌకగా అమ్మివేస్తున్నారు. బొగ్గురంగంలో లాభాలతో నడుస్తున్న సింగరేణి లాంటి సంస్థలలో బొగ్గుబావులను అంబానీ, ఆదానీలకు అమ్మకానికి పెట్టడం జరిగింది. దేశవ్యాప్తంగా 500 బొగ్గుబ్లాకులను మోడీ ప్రభుత్వం దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా అమ్మకానికి పెట్టింది. విశాఖ స్టీల్ ప్లాంట్,ఇన్సూరెన్స్, రైల్వే, విమానయానాలు, ఎయిర్పోర్టులు,డిఫెన్స్ రంగంతో పాటు దేశంలోనే ప్రభుత్వరంగ సంస్థలన్నిటిని తెగనమ్మివేస్తున్నది.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న కార్మికులకు సమాన పనికి సమాన వేతనాలు చెల్లించాలని తీర్పునిచ్చింది అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనంగా నెలకు 26 వేల రూపాయలు చెల్లించాలని నివేదికలు తెలియజేశాయి అయినప్పటికీ అసంఘటిత సంఘటిత రంగాలలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచడం గాని సౌకర్యాలను అమలు చేయడం గాని కేంద్ర ప్రభుత్వం పూనుకోవడం లేదు.అంతేకాకుండా జొమాటో,గిజ్, అమెజాన్,స్కీం వర్కర్లను ఉద్యోగులుగా గుర్తించడం లేదు.కార్మిక చట్టాల పరిధిలోకి తీసుకురావడంలేదు.
చికాగో, నెల్లిమర్ల కార్మిక అమరుల త్యాగాల స్ఫూర్తితో నేడు కార్మిక వర్గం పోరాడటానికి సిద్ధంగా వలసిన అవసరం ఉంది పరిశ్రమల రక్షణ కోసం ఉద్యోగ భద్రత కోసం సమాన పనికి సమాన వేతన సాధన కోసం నెలకి 26 వేల కనీస వేతనం సాధించడం కోసం ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటీకరణ చేయకుండా రక్షించుకోవడం కోసం పీఎఫ్ ఈఎస్‌ఐ పెన్షన్ చట్టబద్ధమైన హక్కులు సౌకర్యాల కోసం జీవించే హక్కు కోసం కార్మిక వర్గం ఐక్యంగా ఉద్యమాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉన్నది లేనట్లయితే 150 సంవత్సరాల క్రితం కార్మిక వర్గం దుర్భరదారిద్ర పని పరిస్థితులను చీకటి బతుకులను గడిపిందో నేడు అదే పరిస్థితిని అనుభవించాల్సిన దుస్థితి పాలకవర్గాలు తీసుకువస్తాయి. చికాగో కార్మికుల రక్తతర్పణలు భవిష్యత్తు కార్మిక వర్గ ప్రయోజనాల కోసం అర్పించబడిందని విషయాన్ని నేటి కార్మిక సోదరులందరూ గమనంలో ఉంచుకొని మన పరిస్థితిలో మెరుగుదల కోసం భవిష్యత్తు తరాల ప్రయోజనం కోసం 137 మే డే సందర్భంగా సమర శంఖం పూరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– జె. సీతారామయ్య
9490700954
(నేడు మేడే)