Thursday, May 1, 2025

లక్నోకు శుభవార్త

- Advertisement -
- Advertisement -

జట్టులో చేరిన మయాంక్ యాదవ్
లక్నో: వరుస గాయాలతో సతమతమవుతున్న లక్నో సూపర్ సెయింట్ స్టార్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. కిందటి ఐపిఎల్‌లో అద్భుత బౌలింగ్‌తో లంకకు పలు మ్యాచుల్లో ఒంటిచేత్తో విజయాలు సాధించి పెట్టిన మయాంక్ కొంతకాలంగా వరుస గాయాలతో బాధపడుతున్నాడు. ఎట్టకేలకు అతను పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. బుధవారం మయాంక్ లక్నో జట్టుతో కలిశాడు. ఇది లక్నో టీమ్‌కు అతి పెద్ద ఊరట కలిగించే అంశంగా చెప్పాలి. గంటకు 150 కి.మీ వేగంతో బంతులు వేయడం మయాంక్ ప్రత్యేకత. అతన్ని లక్నో రూ.11 కోట్లకు రిటైన్ చేసుకుంది. మయాంక్ చేరికతో లక్నో బౌలింగ్ మరింత బలోపేతంగా మారింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన లక్నో నాలుగింటిలో విజయం సాధించింది. కాగా, శనివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో మయాంక్ బరిలోకి దిగే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News