Thursday, August 21, 2025

దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలి : మాయావతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని బిఎస్‌పి అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. శనివారం కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. కుల గణన కోసం దేశంలోని అన్ని దిక్కుల నుంచి డిమాండ్ వస్తున్నట్లు తెలిపారు. కుల గణన డిమాండ్‌తో బిజెపి నిద్రలేని రాత్రులు గడుపుతోందని విమర్శించారు. జాతీయ స్థాయిలో సరైన పద్ధతిలో కుల గణన చేపట్టాలని, ప్రజలకు అందాల్సిన హక్కుల్ని అందేలా చూడాలని మాయావతి డిమాండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News