హైదరాబాద్: ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు పోటెత్తడంతో కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో వరదలలో రైల్వేలైన్ కొట్టుకుపోయింది. శమ్నాపూర్ రైల్వే బ్రిడ్జి కింది భాగంలో భారీగా వరద నీరు చేరుకోవడంతో రైల్వే లైన్ కింద భాగం కొట్టుకపోయింది. శేఖర్ అనే రైతు రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చాడు. సికింద్రాబాద్ – నిజామాబాద్, అక్కన్నపేట – మెదక్ మార్గంలో రైళ్ల రాకపోకలను రైల్వే అధికారులు నిలిపివేశారు. ఏడుపాయల దేవాలయం వరదలలో పూర్తిగా మునిగిపోయింది.. వరదనీరు దేవాలయం పైవరకు చేరుకుంది. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో దేవాలయం వైపు భక్తులు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
నిజామాబాద్ టూ హైదరాబాద్ జాతీయ రహదారిపై వెళ్లే భారీ వాహనాలను దారి మళ్లిస్తున్నారు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు నిర్మల్‌లో కొండాపూర్ మీదుగా వెళ్లాలని సూచస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో జాతీయ రహదారి 44పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో 20 కిలోమీటర్ల మేర రాకపోకలు నిలిచిపోయాయి. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే రోడ్డును బ్లాక్ చేశారు. సదాశివనగర్ నుంచి పొందుర్తి వరకు వాహనాలు నిలిచిపోయాయి. క్యాసంపల్లి వద్ద జాతీయ రహదారి కుంగిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Also Read: భారత్ కు జపాన్ కీలక భాగస్వామి