- Advertisement -
హైదరాబాద్: మెదక్ జిల్లా హావేలిఘనపూర్ మండలం ధూప్‌సింగ్ తండాను వరద ముంచెత్తింది. హెలికాప్టర్ సహాయం కోసం గ్రామస్తులు వేచిచూస్తున్నారు. కొందరు ఇండ్ల పైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకుంటున్నారు. తమను కాపాడాలని గ్రామ ప్రజలు ఆర్తనాదాలు చేస్తున్నారు. హవేలీ ఘనపూర్ మండలం నాగపూర్ వాగులో వరద ఉధృతికి కారు కొట్టుకపోయింది. కారులో నలుగురు ప్రయాణికులు ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు.
కామారెడ్డి నుండి హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారిని మూసివేశారు. జంగంపల్లి వద్ద భారీగా వరద నీరు రోడ్డుపై నుండి ప్రవహిస్తున్న నేపథ్యంలో రోడ్డును అధికారులు మూసివేశారు. కామారెడ్డి మీదుగా హైదరాబాద్ వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
- Advertisement -