Friday, April 19, 2024

ఘనంగా జరిగిన మండమెలిగే పండుగ

- Advertisement -
- Advertisement -

Medaram Jatara

 

మినీ మేడారంలో ఏర్పాట్లు ముమ్మరం

జయశంకర్ భూపాలపల్లి : మేడారం సమ్మక్కసారలమ్మ మహాజాతరకు బుధవారం రాత్రి మళ్లీ మండమెలిగె కార్యక్రమాన్ని చేపట్టారు. కన్నెపల్లి సారలమ్మ గుడిని మేడారంలో సమ్మక్క- సారలమ్మ గుడిని శుద్ధి చేశారు. శుద్ధి చేసే కార్యక్రమం బుధవారం రాత్రి 8 గంటలకు ప్రారంభించారు. బుధ వారం రాత్రి 8 గంటల నుంచి గురువారం ఉదయం 5 గంటల వరకు గుడి గేట్లను మూసివేశారు. గురువారం ఉదయం 6 గంటల నుంచి యధావిధిగా తల్లుల దర్శన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పూజారులు ప్రకటిం చారు. మరోవైపు మినీ మేడారంలో బుధవారం మండమెలిగే పండుగ ఘనంగా జరిగింది. ఈ పండుగతో మేడారం జాతరకు అంకురార్పణ జరిగింది.

గుర్రంపేటలో భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. భూపాలపల్లి మండలం గుర్రంపేటలో గత 5దశాబ్ధాలుగా రెండు సంవత్సరాలకు ఒక్కసారి మూడురోజుల పాటు ఫిబ్రవరి 5నుంచి 8వరకు జరిగే ఈ గిరిజన జాతరకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. అచ్చం మేడారాన్ని తలపించే విధంగా గద్దెల రూపంలో గిరిజన దేవతలు సమ్మక్క సారలమ్మలు కొలువు తీరారు. మాగుశుధ్ద పూర్ణిమ సందర్భంగా వైభవంగా జరిగే ఈ ఆదివాసీ జాతరకు భక్తులు భారీగా తరలివస్తారు. అందులో భాగంగా బుధవారం మండమెలిగే ఘనంగా నిర్వహించారు. మండమెలిగే పండుగతో అసలు జాతర తంతుప్రారంభమవుతుంది.ఈ జాతర సందర్భంగా జాతర చైర్మన్ బద్ది రమేష్‌తో పాటు సర్పంచ్ స్వేతా రవిందర్‌ల ఆధ్వర్యంలో ఆదివాసీ సాంప్రధాయం ప్రకారం ఆ కార్యక్రమం అంగరంగావైభవంగా నిర్వహించారు. డోలు కొమ్మువాద్యాలతో పూజారులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

రూ.7 కోట్లతో భక్తులకు సౌకర్యాల కల్పన..
జాతరకు వచ్చిన భక్తుల సౌకార్యార్ధం కోసం గ్రామీణా నీటిపారుదాల శాఖ నుంచి కేటాయించిన రూ.7కోట్లతో చేపట్టిన పనులు వేగవంతమయ్యాయి. జాతర గుడువు తరుముకొస్తుండడంతో చైర్మన్, సర్పంచ్‌ల పర్యవేక్షణలో పనులు ఊపందుకున్నాయి. ముఖ్యంగా భక్తులకు మంచినీటి సౌకర్యార్ధం కొత్తగా వేసి బోర్లతో పాటు పాత వాటినికూడా మరమ్మతు చేశారు. స్నానగట్టాలు టాయిలేట్లను ఏర్పాటు చేస్తున్నారు.భక్తులను ఆకట్టుకునే విధంగా తల్లుల గద్దెలను అందమైన రంగులతో ముస్తాబు చేశారు. ప్రతిజాతర మాదిరిగానే ఈ సారికూడా 70 వేల మంది భక ్తజనం జాతరకు తరలివస్తారని అంచనా.

Medaram Jatara start
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News