Friday, September 12, 2025

సమ్మక్క, సారలమ్మ గద్దెలు ఆధునీకరణ

- Advertisement -
- Advertisement -

కోయ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా సమ్మక్క, సారలమ్మల గద్దెలు ఆధునీకరణ చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొoగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క సంబంధిత అధికారులను ఆదేశించారు. మేడారం సమ్మక్క సారక్క మాస్టర్ ప్లాన్‌ను వంద రోజుల్లో పూర్తి చేసేందుకు మంత్రులు సచివాలయంలోని పొంగులేటి ఛాంబర్‌లో సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం ప్రిన్సి పల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాస్టర్ ప్లాన్‌లో సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు మార్పులు చేర్పులపై ముగ్గురు మంత్రులకు ఎండోమెంట్ అధికారులు, సంబంధిత జిల్లా అధికారులు, స్థానిక దేవాలయ ప్రతినిధులు వివరించారు. డిజైన్ మార్పుపై ప్రతీ అంశాన్నీ మంత్రులు లోతుగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింభించే విధంగా సిఎం చేసిన సూచనలన్నీ పరిగణనలోకి తీసుకుని పటిష్టంగా ఆధునీకరణ పనులు పూర్తి చేయాలని సూచించారు. వంద రోజుల్లో మాస్టర్ ప్లాన్‌ను పూర్తి చేసేందుకు ప్రణాళికా బద్దంగా ముందుకెళ్లాలని దిశా నిర్దేశం చేశారు.

Also Read: ఎంఎల్‌ఎల చోరీపై రాహుల్ గాంధీ సిగ్గుపడాలి: కెటిఆర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News