Saturday, May 10, 2025

బాచుపల్లిలో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిదిలోని ప్రగతినగర్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విజేత సూపర్ మార్కెట్ ఎదురుగా ఉన్న కాలి ప్రదేశంలో నిల్వ ఉంచిన డెకరేషన్ వస్తువులకు మంటలు అంటుకున్నాయి. దీంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రెండు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశాయి. బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News