Thursday, September 18, 2025

యాదగిరిగుట్టకు మెడికల్ కళాశాల మంజూరు చేయండి: గొంగిడి సునీతా

- Advertisement -
- Advertisement -

 

యాదాద్రి భువనగిరి: యాదగిరిగుట్టకు మెడికల్ కళాశాలను మంజూరు చేయాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి కోరారు. శుక్రవారం హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో రాష్ట్ర ఆర్థిక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావును కలిసి వినతి పత్రం అందజేశారు. ఇప్పటికే యాదగిరిగుట్టకు 100 పడకల ఆస్పత్రి మంజూరు అయిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా మెడికల్ కలశాలను ఏర్పాటు చేయాలని కోరారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తుల రద్దీ విపరీతంగా పెరిగి పోయిందని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సానుకూలంగా స్పందించారని ప్రభుత్వ విప్ తెలిపారు.

Also Read: రుతుపవనాలు వచ్చేసాయ్..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News