Saturday, May 10, 2025

ఎస్టి కమిషన్ ఎదుట మేడిపల్లి బాధితులు

- Advertisement -
- Advertisement -

బాధితుల ఆవేదనను వినిపించిన శ్రీలత బద్రు నాయక్

మన తెలంగాణ/బోడుప్పల్ : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి లో గల సర్వేనెంబర్ 62/1 స్థలంలోని భూ పంచాయతీ ఎస్టి కమిషన్ ముందుకు చేరింది. పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీలత బద్రునాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీలోని లోక్ నాయక్ భవన్ లో గల ఎస్టి కమిషన్ ముందు బాధితుల గోడును వివరించారు. గిరిజనులకు కేటాయించిన ఈ స్థలంలో జరిగిన మోసాన్ని, కొంతమంది స్వార్థపరులు చేసిన అన్యాయాన్ని సవివరంగా వివరించామని శ్రీలత బద్రీనాథ్ తెలిపారు. ఓపికతో విన్న ఎస్టి కమిషన్ ప్రతినిధులు ఈ ఘటనపై సవివరంగా విచారణ చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని ఆమె తెలిపారు. ఈ అంశంపై తనపై ఎన్ని ఒత్తిడిలు వచ్చిన ఏమాత్రం వెనకడుగు వేయకుండా బాధితుల తరఫున పోరాటం చేస్తానని ఈ సందర్భంగా శ్రీలత బద్రు నాయక్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News