Monday, September 8, 2025

బాలీవుడ్‌లో లక్కీ ఆఫర్

- Advertisement -
- Advertisement -

ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు ప్రేక్షకు లకు పరిచయమైన మీనాక్షి చౌదరి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మారింది. మీనాక్షి చౌదరికి మంచి హిట్ దక్కింది తెలుగులో ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ పొందింది. ఇక ఇప్పుడు నాగచైతన్యతో ఒక సినిమా, నవీన్ పోలిశెట్టితో మరో సినిమా చేస్తోంది. ఈ రెండు సినిమాలు కాకుండా మరో బడా తెలుగు సినిమా కూడా చర్చల దశలో ఉంది. ఆమె పాపులారిటీని చూసి బాలీవుడ్ మేకర్స్ కూడా ఆమెకి అవకాశాలు ఇస్తున్నారు. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు ఇప్పుడు ఏకంగా ‘ఫోర్స్ 3’ మేకర్సే ఆమెను వెతు క్కుంటూ వచ్చి ఛాన్స్ ఇవ్వడం మామూలు విషయం కాదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

తాజాగా జాన్ అబ్రహం హీరో సరసన ఆమెకి ఆఫర్ వచ్చిందిట. 50 ప్లస్ జాన్ అబ్రహంతో ఈ భామ నటించ నుంది అన్నమాట. ఈ దెబ్బతో బాలీవుడ్లో సెటిల్ అయిపోవాలని అమ్మడు అప్పుడే ప్లాన్ వేసేస్తోందట. విపుల్ అమృత్లాల్ షా, జాన్ అబ్రహం కలిసి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి నిషికాంత్ కామత్ దర్శకత్వం వహిస్తు న్నాడు. ఆమె పుట్టింది, పెరిగింది అంతా నార్త్ ఇండి యాలోనే. కానీ పేరు, అవకాశాలు వచ్చింది మాత్రం సౌత్‌లో. కాబట్టి ఇప్పుడు నార్త్ భామగా బాలీవుడ్‌లో కూడా అడుగుపెడుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News