Wednesday, July 30, 2025

పదండి ప్రజల్లోకి.. స్థానిక ఎన్నికల్లో గెలిచి తీరాల్సిందే: మీనాక్షి నటరాజన్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో నూటికి నూరు శాతం స్థానాల్లో విజయం సాధించాల్సిందేనని ..’ ఏఐసిసి నాయకురాలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ నాయకులను, కార్యకర్తలు ఆమె పరుగులు పెట్టిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 31 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకూ తొలి విడత పాదయాత్ర, పల్లె నిద్ర, శ్రమదానం చేయడానికి త్రిముఖ వ్యూహాన్ని ఆమె ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్‌తో కలిసి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్యే క్వార్టర్‌లో సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో పది ఉమ్మడి జిల్లాల పార్టీ ఇన్‌ఛార్జిలు, పార్లమెంటు వారీగా నియమితులైన ఇన్‌ఛార్జిలుగా నియమితులైన ఉపాధ్యక్షులు, పిసిసి ప్రధాన కార్యదర్శులు, జిల్లా పార్టీ అధ్యక్షులూ హాజరయ్యారు. అయితే ఆమె జిల్లాల వారీగా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. పాదయాత్రలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చూడాలని, జన సమీకరణ, భారీ ఏర్పాట్లు, పెద్ద ఎత్తున కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం గురించి మీనాక్షి సూచన చేశారు.
ఈ నెల ౩1న రంగారెడ్డి జిల్లా పరిగిలో సాయంత్రం 5 గంటలకు పాదయాత్రకు ఆమె శ్రీకారం చుట్టనున్నారు. మీనాక్షి నటరాజన్‌తో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ నాయకులు, వివిధ కార్పోరేషన్ల చైర్మన్లూ పాదయాత్రలో పాల్గొంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News