Monday, May 12, 2025

ప్రధాని నివాసంలో మీటింగ్.. కాసేపట్లో కీలక ప్రకటన

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌కు శుక్రవారం తాత్కాలికంగా విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్, పాక్‌ల మధ్య కుదిరిన కాల్సుల విరమణ ఒప్పందంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే సరిహద్దుల్లో పాక్ మాత్రం కవ్వింపు చర్యలు ఆపడం లేదు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని గాలికి వదిలేసి మళ్లీ సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతున్నారు. భారత సైనికులు సమర్థవంతంగా తిప్పకొడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ(Modi) నివాసంలో త్రివిధ దళాల అధిపతులతో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం(Meeting) ప్రారంభమైంది.

ఈ సమావేశంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు.. సరిహద్దుల్లో పరిస్థితి గురించి ప్రధాని మోదీతో(Modi) అధికారులు చర్చింనున్నారు. దీనిపై విదేశాంగ శాఖ, రక్షణశాఖ మీడియా సమావేశం(Meeting) ఉండనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News