Thursday, May 8, 2025

హైదరాబాద్‌లో మెగా జాబ్ మేళా

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్‌లో నిర్వహించిన జాబ్ మేళా ఒక విశిష్ట వేదికగా నిలుస్తుందని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలిపారు. బుధవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఉన్న ఖాజా మాన్షన్ ఫంక్షన్ హాల్‌లో డెక్కన్ బ్లాస్టర్ మన్నన్ ఖాన్, బ్లిస్ బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ సంస్థలు సంయుక్తంగా జాబ్ మేళా నిర్వహించాయి. ఈ జాబ్‌మేళాను ముఖ్య అతిథిలుగా విచ్చేసిన దుండ్ర కుమారస్వామి, డాక్టర్ వినయ్ సరికొండ ప్రారంభించారు. ఈ జాబ్ మేళాలో 100కు పైగా ప్రతిష్ఠాత్మక కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించి, అర్హత కలిగిన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలను అందించాయి. ఫార్మా, ఆరోగ్యం, ఐటీ, విద్య, బ్యాంకింగ్ వంటి వివిధ రంగాల్లో విభిన్న హోదాలలో ఉద్యోగాలు ఉన్నాయి.

విశేషంగా కొన్ని కంపెనీలు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ అవకాశాలను కూడా కల్పించాయి. ఈ సందర్భంగా దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ అర్హత కలిగిన యువతీ యువకులు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను ప్రదర్శించాలన్నారు. ఈ జాబ్ మేళా యువతకు ప్రోత్సాహాన్ని, ఉత్తేజాన్ని అందించి వారి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దే స్ఫూర్తిదాయక వేదికగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. జాబ్ మేళా సందర్భంగా బ్లిస్ బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్, సిగ్మా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ క్యాంప్‌లో ప్రముఖ వైద్యులు ఉచిత వైద్య పరీక్షలు, ఆరోగ్య సలహాలు అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News