Wednesday, May 7, 2025

యుద్ధానికి సైరన్

- Advertisement -
- Advertisement -

నేడు దేశవ్యాప్తంగా 259ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్
యుద్ధం వస్తే ప్రాణాలు కాపాడుకోవడంపై పౌరులకు అవగాహన భారత్,

పాక్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరడంతోకేంద్రం చర్యలుహైదరాబాద్‌లోనినాలుగు ప్రాంతాల్లో సెక్యూరిటీ డ్రిల్స్

న్యూఢిల్లీ:పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకు న్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవా రం దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్ నిర్వహించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ క్రమంలో జమ్మూ, కశ్మీర్, ఉత్తరప్రదేశ్‌సహా పలు రాష్ట్రాల్లో మంగళవారమే మాక్‌డ్రిల్ ట్రయల్స్ నిర్వహించారు. బు ధవారం నిర్వహించనున్న మాక్ డ్రిల్స్‌లో అధికారులతోపాటు సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, వాలంటీ ర్లు, హోంగార్డులు, ఎన్‌సిసి/ఎన్‌ఎస్‌ఎస్, నెహ్రూ యువకేంద్రాలు, కళాశాలలు / పాఠశాలల వి ద్యార్థులను దీనిలో భాగస్వాముల్ని చేయనున్నా రు. శత్రుదాడి జరిగినప్పుడు స్వీయరక్షణతోపా టు,విద్యార్థులు, యువకులు, ఎలా ప్రతిస్పందిం చాలో అవగాహన కల్పించాలని హోంశాఖ ఒక సర్కులర్‌లో తెలిపింది. జాతీయ స్థాయిలో బు ధవారం జరగనున్న మాక్ డ్రిల్‌ను 259 ప్రాంతాల్లో నిర్వహించనున్నారు.

ఈ డ్రిల్స్ కు సంబంధించి మంగళవారం జరిగిన సమావేశంలో వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, సివిల్ డిఫెన్స్ చీఫ్స్ ఉన్నారు. 2010 లో నోటిఫై చేసిన 244 సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్ పైనా ప్రత్యేక దృష్టి సారించారు. రాజస్థాన్, పంజాబ్, జమ్ముకశ్మీర్, పశ్చిమబెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లోని జిల్లాలే ప్రధానంగా అం దులో ఉన్నాయి. 259 లొకేషన్లను మూడు కేటగిరీలుగా విభజించారు. కేటగిరీ 1లో 13, కేటగిరి2 లో 201, కేటగిరి 3లో 45 ప్రాంతాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్, విశాఖ పట్నాన్ని ఎంపిక చేశారు. 1971లో తూర్పు పాకిస్థాన్ ( ప్రస్తుత బంగ్లాదేశ్) , పశ్చిమ పాకిస్థాన్ లో పోరాడాల్సి రావడంతో దేశ వ్యాప్తంగా ప్రజలను అప్రమత్తం చేశారు. అంతకు ముందు 1962,65 యుద్ధాల సమయంలో కూడా మాక్‌డ్రిల్ నిర్వహించారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్ నిర్వహించడం ఇదే మొదటి సారి.

పౌరుల ఆత్మరక్షణ కోసమే మాక్‌డ్రిల్
శత్రుయుద్ధ విమానాలు , క్షిపణులు,డ్రోన్లు దూసుకొస్తున్న వేళ ప్రజల సన్నద్ధత కోసం , ఆత్మరక్షణ కోసం మాక్‌డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో సైరన్ అత్యంత కీలకమైంది. గగనతల దా డుల హెచ్చరిక వ్యవస్థల సామర్థాన్ని అంచనా వేసేందుకు , వాయుసేనతో హాట్‌లైన్, రేడియో కమ్యూనికేషన్‌ను వినియో గం లోకి తెచ్చేందుకు కంట్రోల్‌రూమ్‌లు, షాడో కంట్రోల్‌రూమ్‌ల పనితీరును పరీక్షించేందుకు మాక్‌డ్రిల్ నిర్వహిస్తారు. బ్లా క్‌అవుట్ సమయంలో తీసుకోవాల్సిన చర్యలను నేర్పించడం, వాటి ప్రభావాన్ని అంచనా వేయడం కోసం ఈ డ్రిల్స్ ఉపయోగపడతాయి. ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించే ప్లాన్ల ప నితీరును అంచనా వేసుకోవడానికి ఇవి అవకాశం కల్పిస్తాయి. బుధవారం డ్రిల్స్‌లో కీలక పరిశ్రమలు, ప్రభుత్వ భవనాలు, సైనిక ఔట్‌పోస్టులను విద్యుత్ స్టేషన్లు,

కమ్యూనికేషను హబ్స్ కేమోప్లాజ్ చేయడాన్ని కూడా సాధన చేయనున్నారు. ఉపగ్రహాలు, ఇతర గగనతల నిఘా నుంచి తప్పించడానికి ఇలా చే యనున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి మాక్‌డ్రిల్స్‌ను కొన్ని దేశాలు నిర్వహించాయి. 2025 మార్చిలో తైవాన్‌లో నిర్వహించారు. ఇక జపాన్‌లో 2023 నవంబర్‌లో జరిగాయి. ఫిన్లాండ్‌లో కూడా రష్యా ఆక్రమణ భయంతో మాక్‌డ్రిల్ నిర్వహించారు. కాగా బుధవారం నాడు ప్రత్యేకించి సరిహద్దు రాష్ట్రాల్లో శత్రువుల విమానాల దాడి సమయంలో తమను తాము రక్షించుకునే విధానంపై పౌరులు, విద్యార్థులకు ఈ సందర్భంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఎయిర్ రైడ్ సైరన్స్ పనితీరును పరీక్షించడం, సైరన్ ఇచ్చి ప్రజలను ఎలా అప్రమత్తం చేయాలనే అంశంపైనా ప్రధానంగా మాక్‌డ్రిల్ నిర్వహించనున్నారు.ఒడిశాలో పూరీ రథయాత్ర దృష్టా పోలీసులు ప్రత్యేక నిఘా ఏరాపటు చేయడంతో పాటుగా భద్రతను కట్టుదిట్టం చేశారు.

నేడు హైదరాబాద్‌లో మాక్ డ్రిల్
మన తెలంగాణ/హైదరారబాద్ : నగరవ్యాప్తంగా ‘ఆపరేషన్ అభ్యాస్’ పేరుతో డిఫెన్స్ మాక్ డ్రిల్ బుధవారం నిర్వహించనున్నారు. ఇందులో భాగం గా నగరమంతా సైరన్ల మోత మోగనుంది. సైరన్ వినిపించగానే బహిరంగ ప్రాంతాల్లో ఉన్న ప్రజ లు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. సాయం త్రం 4.15 గంటలకు నగరంలోని సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్‌బాగ్, డిఆర్‌డివొ, మౌలాలి ఎన్‌ఎఫ్‌సిలో మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. పోలీసులు, అగ్నిమాపక శాఖ, వైద్య, రెవెన్యూ, స్థానిక అధికారులు ఆయా ప్రాంతాలకు చేరుకుంటారు. అత్యవసర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో ప్రజల కు అవగాహన కల్పిస్తారు. ఈ మాక్ డ్రిల్‌లో 12 సివిల్ డిఫెన్స్ సర్వీసులు పాల్గొననున్నాయి. సాయంత్రం 4 గంటలకు నగరమంతా సైరన్లు మోగించనున్నా రు. అన్ని కూడళ్లలో రెండు నిమిషాల పాటు సైరన్‌లు మోగనున్నాయి. సైరన్ రాగానే ఎలక్ట్రిక్ పరికరాలు, లైట్లు, స్టవ్‌లు ఆపాలని అధికారులు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News