Saturday, September 6, 2025

శుక్రవారం రాశిఫలాలు (05-09-2025)

- Advertisement -
- Advertisement -

మేషం – ఆదాయ వ్యయాలు సరి సమానంగా ఉంటాయి. మీ ప్రమేయం లేకుండా మిమ్మల్ని వివాదాలలోకి లాగే వ్యక్తులు తారసపడతారు. ఇటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి.

వృషభం – అనుకొని అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మీ మాటల చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుని  ముందుకు సాగుతారు. శుభకార్యాలు సానుకూలపడతాయి.

మిథునం – వృత్తి వ్యాపారాలు అనుకున్న విధంగా లాభసాటిగా పయనిస్తాయి. బంధువులతో ఏర్పడిన వివాదాలు సమసిపోతాయి. సోదరుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు.

కర్కాటకం – క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. రెండు మూడు విధాలుగా ఆర్థిక లాభాలు పొందుతారు.

సింహం – మీ మాటలకు వక్రభాష్యాలు చెప్పేవారు అధికమవుతారు. అనుకూలమైన బదిలీ లభించే సూచనలున్నాయి. సమాజ పరంగా వచ్చినటువంటి మార్పులు ఇబ్బందికి గురిచేస్తాయి.

కన్య – ఆదాయాన్ని మించిన ఖర్చులు మానసిక ప్రశాంతతను భంగ పరుస్తాయి. సంతాన పురోభివృద్ధి బాగుంటుంది. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి.

తుల – ముఖ్యమైన వ్యవహారాలను నిదానంగా పూర్తి చేస్తారు. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది.  సోదరుల నుండి శుభ ఆహ్వానాలు అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాలను విస్తరిస్తారు.

వృశ్చికం – నూతన పెట్టుబడుల విషయాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. నలుగురిని కలుపుకుపోయే ధోరణికి నాంది పలుకుతారు. కీలక నిర్ణయాలలో మీ సొంత ఆలోచనలు మీకు మేలు చేస్తాయి.

ధనుస్సు – ప్రతి విషయము మొదట నింపాదిగా సాగినప్పటికీ తుది ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. మొండి బాకీలు కొంతమేర వసూలు అవుతాయి. తనాఖ వస్తువులను విడిపిస్తారు.

మకరం – కార్యాలయంలో పని భారం అధికంగా ఉంటుంది. కొంత ఒత్తిడికి లోనవుతారు. వ్యాపారం ఉన్నతికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు.

కుంభం – డాక్యుమెంటేషన్ లో మీకు తెలియకుండానే సాంకేతిక లోపాలు దొర్లే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. కోర్టు కేసుల నుండి బయటపడతారు. నూతన ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

మీనం – మీ మాట తీరులో కొన్ని మార్పులు చేయడం వలన మరిన్ని మంచి ఫలితాలను పొందగలుగుతారు. మానసిక ధైర్యం పెంచుకోగలుగుతారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించండి.

Rasi phalalu cheppandi

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News