మేషం – మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు. భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. అనుకున్న విధంగా చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.
వృషభం – ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కొంత చికాకు కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది. వివాదాలకు దూరంగా ఉంటారు.
మిథునం – పెట్టుబడుల విషయమై చేసే చర్చలు ఓ కొలిక్కి వస్తాయి. సంతానయోగ క్షేమాలకు అధికంగా ఖర్చు చేస్తారు. కొనుగోలు అమ్మకాలకు సంబంధించి మెలకువలు పాటించండి.
కర్కాటకం – ప్రతి విషయాన్ని భూతద్దంలో చూస్తారు. ఇందువలన మానసిక ప్రశాంతతకు భంగం ఏర్పడుతుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించండి. శుభకార్య ప్రయత్నాలు అనుకూలం.
సింహం – వృత్తి- వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. క్రయవిక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది. స్నేహితులతో, బంధువులతో కలిసి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించగలుగుతారు.
కన్య – ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. సంఘసేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఉద్యోగాలలో ప్రమోషన్లు పొందుతారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలుఅవసరం.
తుల – శ్రమకు తగిన ఫలితాన్ని అందుకోగలుగుతారు.అయితే అందరిని గుడ్డిగా నమ్మడం మంచిది కాదని గ్రహించండి. కార్యాలయంలో మీ స్థాయి పెరుగుతుంది. బాధ్యతలు కూడా పెరుగుతాయి.
వృశ్చికం – వ్యాపారంలో రొటేషన్, లాభాలు బాగుంటాయి. ఆస్తివివాదాలు కొలిక్కి వస్తాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మానసిక ప్రశాంతత పొందుతారు. ప్రముఖుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి.
ధనుస్సు – ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. అనుకోని నూతన అవకాశాలు వస్తాయి.
మకరం – ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంతానం నూతన ఉద్యోగ అవకాశాలు పొందగలుగుతారు. ఇది మీ ఆనందానికి కారణం అవుతుంది. సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు.
కుంభం – ఆర్థిక లావాదేవీలు లాభసాటిగ సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం అన్ని విధాలు మంచిది. ప్రయాణాలలో తొందరపాటు వద్దు.
మీనం – నూతన ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సంతానం చేపట్టిన నూతన ప్రయత్నాలు సానుకూల పడతాయి. భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి.