- Advertisement -
శిథిలమైన గుడిని తొలగించి కొత్త ఆలయ నిర్మాణం కోసం గుంతలు తవ్వుతుండగా అమ్మవారి విగ్రహాలు బయటపడిన ఘటన తిరువారూర్ జిల్లా లో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. జిల్లాలోని సన్నిలం తాలుకా వడకరై మత్తూర్ లో దేవాదాయశాఖ పరిరక్షణలో ఉన్న కాశీ విశ్వనాథర్ ఆలయం శిథిలావస్థకు చేరింది. దీంతో భక్తులు కొత్త ఆలయాన్ని నిర్మించాలనుకున్నారు. ఆదివారం జెసిబితో గుంతలు తవ్వుతుండగా ఒకటిన్నర అడుగుల ఎత్తున్న అమ్మవారి విగ్రహం,ఒక అడుగున్న మరో అమ్మవారి లోహ విగ్రహలు , పూజ వస్తువులు బయటపడ్డాయి. గ్రామస్థుల సమాచారం మేరకు దేవాదాయ శాఖ అధికారులు ఘటన స్థలికి చేరుకొని విగ్రహలను పురావస్తుశాఖ అధికారులకు అప్పగించారు.
- Advertisement -