Monday, August 18, 2025

మెట్రోలో టికెట్ కౌంటర్ ఉద్యోగుల నిరసన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎల్బీనగర్ నుండి మియాపూర్ మెట్రో స్టేషన్ లలో టికెట్ కౌంటర్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరసనకు దిగారు. గత కొంతకాలంగా సరైన జీత భత్యాలు లేవని, ఉద్యోగంలో సరైన సమయ వేళలు లేవని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరు ఉద్యోగం చేస్తుంటే మరొక రిలీవర్ సరైన సమయానికి రాకపోయినా పట్టించుకోవట్లేదు.

కనీసం భోజనం చేయడానికి కూడా సమయం కేటాయించరని వారు వెల్లడించారు. ఇలా గత కొంతకాలంగా ఒత్తిడికి గురైన మెట్రో స్టేషన్ టికెట్ కౌంటర్ ఉద్యోగులు ప్రస్తుతం విధులు బహిష్కరించి మరికాసేపట్లో అమీర్పేట్ హెడ్ ఆఫీస్ వద్ద ధర్నాకి దిగనున్నరు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News