- Advertisement -
ఐపిఎల్ 2025 మెగా టోర్నమెంట్ కీలక దశకు చేరుకుంది. ప్లేఆఫ్ రేసులో నిలబడేందుకు నాలుగైదు జట్లు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో భారత్-పాక్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు ఐపిఎల్ పై ప్రభావం చూపుతున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా దేశంలోని పలు విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నారు. ఈ క్రమంలో ఐపిఎల్ మ్యాచ్ లపై ఎఫెక్ట్ పడుతోంది.
ఈ నెల 11న ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, ధర్మశాల విమానాశ్రయం మూసివేత నేపథ్యంలో ఐపిఎల్ నిర్వహణ కమిటీ, బిసిసిఐ.. మ్యాచ్ వేదికను మార్చాయి. మ్యాచ్ వేదికను ధర్మశాల నుంచి అహ్మదాబాద్‌కు మార్చారు. ఇవాళ సాయంత్రం ధర్మశాల వేదికగా పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ జరగనుంది. దీంతో స్టేడియం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
- Advertisement -